నారా లోకేశ్‌ తండ్రిని మించిన తనయుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నారా లోకేశ్‌ తండ్రిని మించిన తనయుడు

నారా లోకేశ్‌ తండ్రిని మించిన తనయుడు

Written By news on Thursday, March 9, 2017 | 3/09/2017

గుంటూరు : అబద్ధాలు చెప్పటంలో నారా లోకేశ్‌ తండ్రిని మించిన తనయుడిగా మారిపోయారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కళ్లార్పకుండా  అబద్ధాలు చెప్పటంలో లోకేశ్‌ ఆరితేరి ముదిరిపోయారని ఆయన అన్నారు.  ఆరేళ్లుగా ప్రకటించిన ఆస్తులు కొన్న ధర ప్రకారమని చెప్పిన లోకేశ్‌‌, చంద్రబాబులు ఇన్నాళ్లు  ప్రజలను పచ్చి మోసం, దగా చేశారని ఆయన అన్నారు. నారా లోకేశ్‌ ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్‌ చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఇచ్చిన వివరాలను చూస్తుంటే పచ్చిమోసం, దగా చేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని ధ్వజమెత్తారు.

నారా లోకేశ్‌ ఆస్తుల వ్యవహారంపై ’సాక్షి’ కన్నా ముందుగా ఆంగ్ల దినపత్రిక ’హిందుస్తాన్‌ టైమ్స్‌’ సమగ్రంగా ఓ వార్తను ప్రచురించిందని అంబటి అన్నారు. ఆరు నెలల కాలంలో వందల కోట్ల ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నిస్తే దానికి సమధానం ఇవ్వకుండా ఎదురు దాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పై పెచ్చు వైఎస్‌ జగన్‌ ను ఆస్తులు ప్రకటించాలని  ప్రశ్నించడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. దొంగ లెక్కలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంబటి అన్నారు.

2014 మార్చిలో రూ.200 ఉన్న హెరిటేజ్‌ షేర్‌ ధర 2017 ఫిబ్రవరికి రూ.1134కు చేరిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే షేర్‌ ధర పెరిగిందని అంబటి తెలిపారు. ఆస్తులపై లోకేశ్‌ చెపుతున్న లెక్కలన్నీ బోగస్‌ అని, ప్రజలను మభ్యపెట్టేందుకే ఆస్తులు ప్రకటించారన్నారు
Share this article :

0 comments: