మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ

మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ

Written By news on Friday, March 24, 2017 | 3/24/2017


మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ
 వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్‌ లో పర్యటించారు. ఈ సందర్భంగా మిర్చిరైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. పంట అమ్మితే కూలి డబ్బులు కూడా రావడం లేదన్నారు. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ...వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు.
ఈ మధ్యనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్కెట్‌ యార్డ్‌ ను సందర్శించారని, ఆ తర్వాత మిర్చి క్వింటాల్‌ ధర మరింత పడిపోయిందని రైతులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 60శాతం ధరలు పడిపోయాయన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణాలో ఏ కెనాల్‌ కు నీళ్లు ఇవ్వలేదన్నారు. కల్తీ విత్తనాలు, నీరు అందకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, రోజురోజుకు రైతులపై రుణభారం పెరుగుతూ ఉందని రైతులు తమ గోడు వెలిబుచ్చారు.
Share this article :

0 comments: