బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే కేసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే కేసులు

బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే కేసులు

Written By news on Monday, March 6, 2017 | 3/06/2017


విజయవాడ: కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం బాధాకరమని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే తనపై కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడుతూ.. బస్సులో రెండో డ్రైవర్ లేడని, డిక్కీలో పడుకున్నాడని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. బస్సు కల్వర్టు పైనుంచి కిందకు పడినప్పుడు డిక్కీలో వ్యక్తి బతుకుతాడా అని ప్రశ్నించారు. పోస్టుమార్టం చయకుండా మృతదేహాలను తరలించే ప్రయత్నం చేశారని, నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయకపోతే జైలుకు వెళ్తారనడం తప్పా అని అడిగారు. యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పించకుండా కుయుక్తులు చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి వైఎస్ జగన్ ను విలేకరులు ప్రశ్నించగా... ఆయన గురించి మాట్లాడడం అనవసరమని సమాధానమిచ్చారు. ఆయనకు మతిస్థిమితం ఉందో, లేదో తెలియదన్నారు. గజరాజు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరగడం సహజమని వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: