వైఎస్‌ఆర్‌సీపీ విజయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌సీపీ విజయం

వైఎస్‌ఆర్‌సీపీ విజయం

Written By news on Wednesday, March 22, 2017 | 3/22/2017

అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.

మొదటి ప్రాధాన్య త ఓట్లలో గోపాల్‌ రెడ్డికి 53,714 ఓట్లు లభించగా.. కేజే రెడ్డికి 41,037, గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయిస్తే మిగిలిన 1,35,772 ఓట్లలో ‘మ్యాజిక్‌ ఫిగర్‌’గా నిర్ధారించిన 67,887 ఓట్లను.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గోపాల్‌రెడ్డి దక్కించుకున్నారు. ఫలితాల అనంతరం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీలేనిపోరాటం చేస్తానన్నారు. ప్రజాక్షేత్రంలో వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ఉండటం మూలంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు.
Share this article :

0 comments: