మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి:గట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి:గట్టు

మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి:గట్టు

Written By news on Monday, March 27, 2017 | 3/27/2017


‘మిర్చి’ కే్రందాలు ఏర్పాటు చేయాలి
వైఎస్సార్‌ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
మిర్యాలగూడ: రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాం డ్‌ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న మిర్చికి పూర్తి స్థాయి లో గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను పత్తి సాగుకు బదులుగా కంది పంట సాగు చేయాలని చెప్పిన వ్యవసాయాధికారులు కనీసం మద్దతు ధర చెల్లించడం లేదని విమర్శించారు.
Share this article :

0 comments: