చంద్రబాబే మానసిక రోగి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబే మానసిక రోగి

చంద్రబాబే మానసిక రోగి

Written By news on Saturday, March 4, 2017 | 3/04/2017


చంద్రబాబే మానసిక రోగి
వైఎస్సార్‌సీపీ నేత కరుణాకర్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబే ఒక మానసిక రోగి అని, రాష్ట్రానికి పట్టిన పీడ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీ బస్సు ప్రమాదానికి గురై అనేకమంది చనిపోతే యాజమాన్యాన్ని శిక్షించాల్సిందిపోయి.. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన, గాయపడిన వారి పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. పైగా అధికారులపై ఎగబడినట్టు కేబినెట్‌లో తీర్మానాలు చేయించటం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప్రమాద స్థలానికి సమీపంలోనే ఉండి కూడా అక్కడికి రాలేదని గుర్తుచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం భూమన విలేకరుల తో మాట్లాడారు. బస్సు ఘటనకు బాధ్యుడైన డ్రైవర్‌ చనిపోయినప్పడు పోస్టుమార్టం చేయాల్సిన చట్టబద్ధ వ్యవహారాన్ని పక్కనపెట్టి శవాన్ని తరలించడం అన్యాయమని ప్రశ్నించి, వివరణ కోరడం తప్పా...? అని నిలదీశారు. చంద్రబాబు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను అంతు చూస్తానని గతంలోబెదిరించింది వాస్తవం కాదా అని నిలదీశారు. ‘అధికారులను జైలుకు పంపిస్తానంటూ బెదిరించాడు, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు..’ అంటూ ప్రతిపక్ష నేతపై కేబినెట్‌లో తీర్మానం చేయడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని భూమన ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయని, అధికారులు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు.
Share this article :

0 comments: