చంద్రబాబుదంతా అంకెల మాయ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుదంతా అంకెల మాయ

చంద్రబాబుదంతా అంకెల మాయ

Written By news on Wednesday, March 15, 2017 | 3/15/2017


చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించినదంతా అంకెల మాయేనని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
 • ఏపీ బడ్జెట్ సమావేశాలు చూసిన తర్వాత బడ్జెట్‌లో వీళ్లు చూపిస్తున్న లెక్కలు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయి
 • ఈ బడ్జెట్‌లో చంద్రబాబు నాయుడు 2016-17కు సంబంధించి 11.61 శాతం వృద్ధిరేటు నమోదు కాబోతోందని అన్నారు
 • వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలన్నింటి అభివృద్ధితోనే మొత్తం వృద్ధిరేటు ముడిపడి ఉంటుంది
 • ఈ మూడు రంగాల్లో అభివృద్ధి కనిపిస్తే ముందుకెళ్లిందని, లేకపోతే తిరోగమనంలో ఉందని అంటారు
 • 2022, 29, 50 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు కూడా చంద్రబాబు చూపించారు
 • అప్పటికి దేశంలో అత్యధికంగా వృద్ధిచెందిన రాష్ట్రం అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
 • ఈమధ్య కాలంలోనే ఐఎంఎఫ్ కొన్ని లెక్కలు విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సగటు జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం అని, భారతదేశంలో 7.1 శాతం ఉందని చెప్పింది. దాని ప్రకారం దేశం బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు.
 • మరి ఆంధ్రప్రదేశ్ ఏకంగా 11.61 శాతం నమోదు చేసిందంటే ప్రపంచంలో ఇప్పటికే మనం నెంబర్ వన్ గా ఉన్నట్లు లెక్క
 • అలాంటప్పుడు 2020, 29, 50 వరకు లక్ష్యాలు పెట్టుకోవడం ఎందుకు?
 • బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి కూడా చెప్పారు
 • ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెప్పిందని అన్నారు, అందుకే దానికి సమానంగా ప్రత్యేక సాయం పొందామని కూడా తెలిపారు
 • 14వ ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్ గోవింద్ రావు, అభిజిత్ సేన్, చైర్మన్ వైవీ రెడ్డి లాంటివాళ్లు అసలు అలాంటి సిఫార్సులు ఏమీ చేయలేదని స్పష్టం చేశారు
 • రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు, తమకు ఏమీ సంబంధం లేదన్నారు
 • రాయితీలకు సంబంధించి అవార్డు తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు
 • ఏపీ డిస్కంలకు 62.7 శాతం నష్టాలు పెరిగితే ఎవరైనా అవార్డు ఇస్తారా?
 • క్రిసిల్ రేటింగ్ గమనిస్తే డిస్కంలలో ఒకదానికి బి+ నుంచి బి కేటగిరీ వచ్చింది. మరో డిస్కంకు అలాగే రేటింగ్ ఉంది తప్ప పెరగలేదు
 • మరి ఇలాంటప్పుడు ఆయనకు ఐదు అవార్డులు ఎందుకు ఇస్తారు
 • శిథిలమైన భవనంలో చిన్న కిటికీ శుభ్రంగా ఉందని దానికి అవార్డు ఇచ్చినట్లు చంద్రబాబు చెబుతున్నారు
 • 2017-18కి సంబంధించి చంద్రబాబు 1.56 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు.. రాష్ట్రం విడిపోక ముందు 2013-14 చూసుకుంటే రెండు రాష్ట్రాలకు కలిపి మన బడ్జెట్ 1,40,742 కోట్లు.
 • తెలంగాణది, మనది కలిపితే మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్లు ఉన్నాయి, అంత గొప్ప పాలన సాగుతోంది, అంత గొప్పగా అంకెలు చూపుతున్నారు
 • నిజంగా రెవెన్యూలు అంత అద్భుతంగా ఉన్నాయా అంటే, చంద్రబాబు కోర్ డాష్ బోర్డే చూద్దాం
 • అందులో ప్రభుత్వ ఆదాయాలు అన్నీ కలిపి 1,28,009 కోట్ల లక్ష్యం అయితే.. వచ్చింది మాత్రం 99,535 కోట్లు మాత్రమే.
 • ప్రభుత్వ వ్యయం చూస్తే.. 1,35,688 కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటివరకు 1,16,812కోట్లు మాత్రమే.
 • 2016 డిసెంబర్ 31 నాటికే 30,953 కోట్ల అప్పులు తెచ్చుకున్నారు. కానీ వాస్తవానికి ఎఫ్ఆర్‌బీఎం పరిమితి ప్రకారం 20 వేల కోట్లకు మించి అప్పు తెచ్చుకోడానికి వీల్లేదు
 • దీనిపై కేంద్రం చీవాట్లు పెట్టిందో ఏమో తెలియదు గానీ, చంద్రబాబు ఈ విధంగా అప్పులు చేస్తున్నారు
 • ఆర్‌బీఐ నిబంధనలు ఉంటాయి కాబట్టి పెన్షనర్ల సొమ్ములను అత్తగారి సొమ్ము అన్నట్లుగా తీసేసుకుంటున్నారు
 • ఇది రొటీన్‌గా జరుగుతోంది, చాలా ప్రమాదకరమైనది
 • నిబంధనల ప్రకారం 3 శాతానికి మించి అప్పు తీసుకోకూడదంటే 5 శాతానికి పైగా చేస్తున్నారు
 • ఇలా ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా ఉల్లంఘించారు
 
Share this article :

0 comments: