చంద్రబాబు తప్పించుకోలేరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు తప్పించుకోలేరు

చంద్రబాబు తప్పించుకోలేరు

Written By news on Monday, March 6, 2017 | 3/06/2017


చంద్రబాబు తప్పించుకోలేరు
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు నుంచి టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోలేరని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు.

ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ.. కేసు తీవ్రతను సుప్రీం కోర్టు గుర్తించిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. విచారణ సమయంలో కోర్టుకు వివరాలన్నీ సమర్పిస్తామని చెప్పారు.
Share this article :

0 comments: