విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ నోటి ద్వారా అబద్ధాలు చెప్పించడం బాధాకరమైన విషయం అని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాసిస్తుందో అదే గవర్నర్ చదువుతారన్నారు. విజయవాడలో ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఆయన సోమవారం సాయంత్రం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై వైఎస్ జగన్ స్పందిస్తూ "చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వరుసగా మూడేళ్లు కరువొచ్చింది.
ఓవైపు రైతులు కరువుతో అల్లాడుతుంటే మరోవైపు చంద్రబాబు మాత్రం దేశం కంటే రాష్ట్రం అయిదు శాతం ఎక్కువ అభివృద్ధి చెందిందంటున్నారు. జీఎస్‌టీ వచ్చినా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు రాయితీలు కొనసాగుతాయని చట్టంలో ఉంటే చంద్రబాబు మాత్రం మార్చితో ప్రత్యేక హోదా అయిపోతుందంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. అలాగే రాజధానిలో ప్లాట్ల కేటాయింపు కుంభకోణంగా మారింది. చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, దగ్గర మనుషులకు రోడ్ల పక్కన కూడళ్లలో ప్లాట్లు దక్కాయి. రైతులకు మాత్రం ఎక్కడో మారుమూల పాట్లు ఇచ్చారు. ప్లాట్‌ల కేటాయింపు పచ్చ చొక్కావాళ్లకు బాగా కేటాయింపులు జరిగాయి.

ఇది భూములు తీసుకున్న రైతులకు అన్యాయం జరిగినట్లు కాదా? అమరావతిలో భూమల లాటరీ అనేది ఓ స్కామ్ గా తయారు చేశారు. టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకు నాలుగువైపులా రోడ్లు, రెండు కమర్షియల్ జోన్ల మధ్య 12వేల గజాల ప్లాట్లు ఇచ్చారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుమారుడికి నేలపాడులో సడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ ను ఆనుకుని ప్లాట్లు కేటాయించారు. స్పీకర్ పీఏకు వెలగపూడిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ప్లాట్లు ఇచ్చారు.
గుంటూరు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే కుమార్తెకు మందడంలో ఇరువైపులా రోడ్లు ఉన్న ప్లాట్లు కేటాయించారు. అసలు లాటరీ పద్థతిలో పారదర్శకత ఉందా?. మంచి ప్లాట్లు మీరు తీసుకుని, ఎక్కడో మారుమూల ఉన్నవి రైతులకు ఇస్తారా? రాజధానిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్‌కు తెర తీసి, తన మనషుల భూములను రియల్ ఎస్టేట్ జోన్ లో పెట్టారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలకు లబ్ది చేకూరేలా చేశారు. రైతుల వద్ద భూములు తీసుకుని ఇదేంటి బాబు, నీ మనుషులకు మేలు చేయడం ధర్మమా? అని సూటిగా ప్రశ్నించారు.
0 comments:
Post a Comment