విజయవాడ:
దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అందుకే శవరాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కాబట్టే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదన్నారు. వాస్తవాలు వెల్లడవుతాయన్న భయంతోనే పోస్టుమార్టం చేయలేదని తెలిపారు. దివాకర్ ట్రావెల్స్‌పై కాకుండా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు పెట్టడం విడ్డురంగా ఉందన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబుకు అలవాటైందని పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అంబటి స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం, రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, నందిగామ ప్రభుత్వాస్పత్రిలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కలెక్టర్ తో దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నేత వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటీన కేసు నమోదు చేయడం గమనార్హం. వైఎస్ జగన్ సహా పార్టీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్, అరుణ్ కుమార్ లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది విధులుకు ఆటంకం కలిగించారంటూ వైఎస్ జగన్ సహా పార్టీ నేతలపై సెక్షన్ 353, 503,34 కింద కేసులు నమోదు అయ్యాయి.

0 comments:
Post a Comment