'ఓటుకు కోట్లు' వీడియోను చూడలేదేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ఓటుకు కోట్లు' వీడియోను చూడలేదేం?

'ఓటుకు కోట్లు' వీడియోను చూడలేదేం?

Written By news on Saturday, March 4, 2017 | 3/04/2017


'ఓటుకు కోట్లు' వీడియోను చూడలేదేం?
⇒ బాబుకు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ప్రశ్న
⇒ మంత్రివర్గం చూడాల్సిన వీడియోలు చాలా ఉన్నాయని ఎద్దేవా


గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌):  కేబినెట్‌ సమావేశంలో రోడ్డు ప్రమాద ఘటన బాధితులను విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించడానికి సంబంధించిన వీడియోలను చూశామని చెబుతున్న సీఎం చంద్రబాబు మంత్రివర్గం అసలు చూడాల్సిన వీడియాలు చాలానే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా ఎద్దేవా చేశారు.

‘రాష్ట్రంలో ఏ సీఎం చేయని దౌర్భాగ్యమైన పని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని పంపించి రూ.5 కోట్లతో ఎమ్మెల్యేను కొంటూ పట్టుబడిన వీడియోలను చూడాలి. ‘మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ’ అంటూ అందరి పరువు తీసిన వ్యక్తి కేబినెట్‌ హెడ్‌గా ఏవిధంగా పనికొస్తాడు? మీలాంటి వాళ్లు మాకెందుకంటూ కేబినెట్‌ లో తీర్మానం చేయండి. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో తొక్కిసలాటకు కారణమై 29 మందిని చంపేశా రు. కేబినెట్‌ ఆ వీడియో చూడాలి..’ అని రోజా అన్నారు.

శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరుల తో మాట్లాడారు. ‘చింతమనేని ప్రభాకర్‌ ఇసుకను అడ్డ దిడ్డంగా దోచుకుంటుంటే అడ్డుకున్న తహశీల్దార్‌ వనజా క్షిని ఆయన ఏవిధంగా కొట్టాడో ఆ వీడియోలు చూడండి. అలాగే చింతమనేనిని అరెస్ట్‌ చేయాలని కేబినెట్‌ తీర్మానం చేస్తే ప్రజలు హర్షిస్తారు. టీడీపీకే చెందిన గుంటూరు జెడ్పీ చైర్మన్, మైనార్టీ మహిళ జానీమూన్‌.. మంత్రి రావెల కిషోర్‌బాబు వల్ల తన కుటుంబానికి ప్రాణ గండం ఉందని బోరున విలపిం చారు. అందువల్ల ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని కేబినెట్‌లో తీర్మానిస్తే ప్రజలు హర్షిస్తారు..’ అని రోజా అన్నారు. నారాయణ కాలేజీలో తమ పిల్లలు చనిపో తుంటే ఆ తల్లులు కడుపుకోతతో  ఏడు స్తున్న వీడియోలు కూడా చూడాలన్నారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు వచ్చిన జగన్‌ తీరును ఖండిస్తున్నామని కేబినెట్‌ తీర్మానం చేయడం సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవాచేశారు.

‘లోకేష్‌కు అండగా ఉన్నాడని కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ కేసులో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కాపాడింది మీరు కా దా? ఆ రాకెట్‌లో 200 సీడీలు దొరికితే సీపీ గౌతంసవాంగ్‌ ఆ సీడీలు ఎందుకు కేబినెట్‌కు ఇవ్వలేదు? వాటి మీద చర్చ ఎందుకు జరగలేదు?’ అని రోజా నిలదీశారు.‘మీ మనవడిని ఎత్తుకుని ముద్దాడాడని పది మంది మృతికి కారణమైన దివాకర్‌ ట్రావెల్స్‌ అధినేత, ఎంపీ జె.సి.దివా కర్‌రెడ్డిని కాపాడుతున్నారా?’ అని చంద్రబాబును రోజా ప్రశ్నించారు. తక్షణమే దివాకర్‌ ట్రావెల్స్‌ యాజ మాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టర్, డాక్టర్‌పై చర్యలు తీసుకోండి..
వైఎస్‌ జగన్‌ భుజం మీద చేయి వేసి లాగిన కలెక్టర్‌పై, చేతిలో ఉన్న పేపర్స్‌ లాక్కున్న డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యత నిర్వర్తిస్తుంటే ఆ పనికి విఘాతం కలిగించిన కలెక్టర్, డాక్టర్‌పై విచారణ చేపట్టాలన్నారు.
Share this article :

0 comments: