www.ysrcongress.net :
Home » » ఒక్క ఛాలెంజ్‌ కే రూలింగ్‌ ఇస్తారా?

ఒక్క ఛాలెంజ్‌ కే రూలింగ్‌ ఇస్తారా?

Written By news on Friday, March 24, 2017 | 3/24/2017


అమరావతి: ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసంతృప్తి వ‍్యక్తం చేశారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో మా‍ట్లాడుతూ....సభలో ఒక్క ఛాలెంజ్‌ కే రూలింగ్‌ ఇస్తారా, తమ ఛాలెంజ్‌ లపై రూలింగ్‌ ఇవ్వారా అని ప్రశ్నించారు. దేనికైనా ధర్మం, న్యాయం ఉండాలని పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరామని, కానీ స్పీకర్‌ ను అడ్డం పెట్టుకుని అనర్హత వేటు పడకుండా చూస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు.
అనర్హత వేటు వేస్తే ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామన్న సవాల్‌ కు స్పందించలేదని, ఓటుకు కోట్లు కేసులో మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మి అనే వాయిస్‌ చంద్రబాబుదో, కాదో చెప్పాలని సవాల్‌ విసిరామని, దానిపై ఇప్పటివరకూ స్పందనలేదన్నారు.  ప్రతిపక్షం సవాళ్లపై స్పందించరని, అదే అధికారపక్షం సవాల్‌పై మాత్రం స్పందించాలని ఎదురు దాడి చేయడం సరికాదని వైఎస్‌ జగన్‌ అన్నారు. స్పీకర్‌ కూడా అధికారపక్షం వైపే ఉన్నారన్నారు.

చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ కలిసి తనపై తప్పుడు కేసులు వేయించారని, అందుకే అవిశ్వాసం సమయంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కార్‌ను చంద్రబాబు కాపాడారని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. తన ఆస్తి లక్ష కోట్లు అని ఒకసారి, రూ.43వేల కోట్లని మరోసారి చెబుతున్నారని, అందులో 10శాతం ఇవ్వాలని తాను సవాల్‌ చేస్తే ప్రభుత్వం పారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తన సవాళ్లపై స్పందించేందుకు ఇంతవరకూ ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు. మళ్లీ అవే ఆరోపణలు తనపై చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఎప్పుడైనా వన్‌సైడ్‌ ఛాలెంజ్‌ ఉండదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారంలో తాను చేసిన సవాల్‌ కు సర్కార్‌ నుంచి స్పందనే లేదన్నారు.
అధికార పార్టీ నేతలకు సంబంధించి అగ్రిగోల్డ్‌ బాధితులు తనకు చాలా సమాచారం ఇచ్చిరని వైఎస్‌ జగన్‌ తెలిపారు. సభలో వాటిని తాను బయటపెడతాననే భయంతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారన్నారు. వాస్తవాలు చెబుతుంటే మైక్‌ కట్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. సభలో తనను అడ్డుకున్నా టీడీపీ నేతలు, ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. సాయంత్రం మీడియా ఎదుట మొత్తం ఆధారాలతో సహా వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
హాయ్‌లాండ్‌ ఆస్తులు ఎందుకు వేలానికి రాలేదని, యారాడ ప్రాపర్టీస్‌, షాపింగ్‌ మాల్స్‌ ను ఎందుకు వేలంలో చేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం మోసం చేస్తోందని, బాధితుల వద్దకు తాను వెళ్లి వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మృతులకు రూ.10 ల​క్షల చొప్పున చెల్లిస్తామనగానే కాస్త చలనం వచ్చిందన్నారు. మొదట రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించి ...ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచిందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

సభలో తాను మాట్లాడిన ప్రతిసారి మైక్‌ కట్‌ చేస్తున్నారని, అధికారపక్ష సభ్యులు లేచి సభను దారి మళ్లిస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వాన్ని నిలదీయగానే నలభై రోజుల కిందట వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ప్రజల గొంతు తాము వినిపిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటోందని, సభలో తమపై ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాళ్ల ట్రాప్‌ లో పడకుండా సంయమనం పాటిస్తే మళ్లీ తప్పుబడుతున్నారన్నారు. తమ సవాళ్లను చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని ఆయన అన్నారు.
Share this article :

0 comments: