బ్లాక్ లిస్టు అయిన కంపెనీలతో పనులు చేయిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్లాక్ లిస్టు అయిన కంపెనీలతో పనులు చేయిస్తున్నారు

బ్లాక్ లిస్టు అయిన కంపెనీలతో పనులు చేయిస్తున్నారు

Written By news on Thursday, March 16, 2017 | 3/16/2017




తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
బ్లాక్ లిస్టు అయిన కంపెనీలతో పనులు చేయిస్తున్నారు
యనమల వియ్యంకుడు సహా అందరూ సబ్ కాంట్రాక్టర్లే
అసెంబ్లీలో కడిగేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

చంద్రబాబు నాయుడు ఇంతకుముందు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, అప్పట్లో ఈయన ఒక్క రూపాయి కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చుపెట్టలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు ప్రసంగానికి స్పందనగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు స్పీచ్ వింటే, నిజంగా పోలవరం ప్రాజెక్టు ఆయన స్వప్నం అన్నట్లు అనిపిస్తుందన్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు ఖర్చయిన 8800 కోట్లలో 5540 కోట్లు చంద్రబాబు సీఎం కాకముందే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఖర్చయిందని తెలిపారు. ఆరోజు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం 172 కిలోమీటర్ల కుడికాల్వలో 144 కిలోమీటర్లు, ఎడమకాలువ 182 కిలోమీటర్లలో 135 కిలోమీటర్లు పూర్తిచేసిందని, ఆ ఘనత రాజశేఖరరెడ్డిదేనని అన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేసి మూడేళ్లవుతున్నా ఆయన 3300 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.

చంద్రబాబు పార్టీకి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ 110 కోట్ల పనులు మాత్రమే చేసి, తర్వాత బ్లాకౌట్ అయ్యిందని, అలాంటి కంపెనీని పక్కన పెట్టాల్సింది పోయి వాళ్లతోనే పనులు చేయిస్తూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడితో సహా అందరూ నామినేషన్ పద్ధతి మీద సబ్ కాంట్రాక్టుల పేరుతో ఇష్టం వచ్చిన వాళ్లకు ఇష్టం వచ్చినట్లు పనులు ఇస్తూ, ఖర్చును పెంచి చూపిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పనులు ఇంత దారుణంగా జరుగుతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు, తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేసిందని అన్నారు. నాటి సభలో కనీసం 148 మంది మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వం నిలబడని పరిస్థితి ఉన్నా, కిరణ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు విప్ జారీ చేసి మరీ ఆయన ప్రభుత్వాన్ని కాపాడారన్నారు. ఆ విషయాన్ని ఆయన కన్వీనియెంట్‌గా మర్చిపోయారని తెలిపారు. ఇదే పోలవరం గురించి నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి కేంద్రం ఇచ్చేసిందని అంటున్నారని, కానీ అరుణ్ జైట్లీ ఇచ్చిన ప్రెస్‌నోట్‌లో.. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు ఇచ్చినట్లు ఉందని గుర్తు చేశారు. ట్రాన్స్‌ట్రాయ్ బ్లాక్ లిస్టు అయిందని, బ్యాంకులు ఎన్‌పీఏ కింద దాని ఆస్తులు వేలం వేస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు దాన్ని తీసేసి కొత్త కాంట్రాక్టరును పిలిస్తే ప్రయోజనం ఉండేదని తెలిపారు. ఆ రోజుకు, ఈ రోజుకు  స్టీలు, సిమెంటు, డీజిల్ అన్ని ధరలూ తగ్గాయని తెలిపారు.
Share this article :

0 comments: