హోదాపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోదాపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం

హోదాపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం

Written By news on Thursday, March 23, 2017 | 3/23/2017


అమరావతి: విపక్షం నిరసనలు, నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది.  గురువారం సమావేశాలు ప్రారంభం కాగానే ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి సభలో తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. అయితే వాయిదా తీర‍్మానంపై చర్చించాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నిరసన తెలుపుతూ చర్చ జరపాలంటూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.



ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై శాసనసభలో మరోసారి తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్‌ అంశంపై ప్రకటన చేయనున్నారు. ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, వ్యవసాయం, విద్యుత్‌, అటవీశాఖ పద్దులపై చర‍్చ జరగనుంది.
Share this article :

0 comments: