
అమరావతి: శాసనసభలోనే కాదూ... అసెంబ్లీ బయట కూడా అధికారపక్షం దౌర్జన్యం కొనసాగింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడకుండా టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మహిళలపై వేధింపుల అంశంపై మాట్లాడుతున్న సమయంలో అక్కడకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత...వాళ్లని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. అంతేకాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
అనంతరం గిడ్డి ఈశ్వరి తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న సమయంలో అక్కడకు మంత్రి పీతల సుజాత, టీడీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు అక్కడకు వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు మీడియా సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేల దురుసు ప్రవర్తన బట్టబయలు అయింది. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను అక్కడ నుంచి బలవంతంగా మార్షల్స్ తో అక్కడ నుంచి తరలించారు.

0 comments:
Post a Comment