)

గుంటూరు : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 1, 2వ తేదీల్లో గుంటూరులో రైతుదీక్ష చేపట్టనున్నారు. కాగా ఈనెల 26, 27తేదీల్లో జరగాల్సిన దీక్ష వాయిదా పడినట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మద్దతు ధర లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారి తరఫున వైఎస్‌ఆర్ సీపీ పోరాడుతుందన్నారు.
మే ఒకటి, రెండు తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేపడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే వైఎస్ జగన్ ఈ దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లభించక, రుణ మాఫీ కాక ఆత్మహత్యల బాట పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్ సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందని బొత్స ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబుది మాటల సర్కారే కానీ, చేతల సర్కార్ కాదని మండిపడ్డారు. రైతులంతా ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని బొత్స సత‍్యనారాయణ కోరారు.
ముందస్తు ఎన్నికలు రావాలని తాము కోరుకోవడం లేదని, అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమే అని బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందన్న చంద్రబాబు మాటలు నిజమైతే ...పార్టీ ఫిరాయించిన 21మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఎందుకు ఉప ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

0 comments:
Post a Comment