వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు

వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు

Written By news on Saturday, April 1, 2017 | 4/01/2017



వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన షెల్ కంపెనీపై ఈడీ దాడులు నిర్వహించిందంటూ అడ్డగోలు ప్రసారాలు చేసిన చానెళ్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్‌ షెల్ కంపెనీ జగన్ మోహన్ రెడ్డికి చెందినదంటూ శనివారం కొన్ని టీవీ చానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయి. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రసారాలు చేసిన చానెళ్లకు వైఎస్ జగన్ తరఫున న్యాయవాదులు లీగల్ నోటీసులు పంపించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించినదైన రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్‌ తో పాటు మరికొన్ని షెల్ కంపెనీలపై సోదాలు నిర్వహించామని ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ శనివారం తన ట్విటర్ లో ట్వీట్ చేసింది. ఎలాంటి వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా ఈడీ చేసిన ట్వీట్ ను ఆధారంగా కొన్ని ఎల్లోమీడియా చానెళ్లు అడ్డగోలు కథనాలు అల్లుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికి శతవిధాలా ప్రసారాలు చేశాయి. ఈడీ చేసిన ట్వీట్ వాస్తవ విరుద్ధమని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. అందులో పేర్కొన్న షెల్ కంపెనీతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఈడీ ట్వీట్ చేయడంపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈడీకి లేఖ రాశారు. అందులో పేర్కొన్న కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని, పూర్తి వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు.
దాని ఆధారంగా కొద్ది నిముషాల వ్యవధిలో ఎల్లో మీడియాలో కథనాలు రావడం చూస్తే అంతా పక్కా ప్లాన్‌ ప్రకారం కుట్ర పూరితంగా సాగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షణాలపై ఏబీఎన్, టీవీ9, ఈటీవీలు వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలు ప్రసారాలకు ఒడిగట్టాయి. దీనిపై జగన్ తరఫున న్యాయవాది ఆయా చానెళ్లకు లీగల్ నోటీసులు పంపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా జగన్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రచారాలు చేయడమేంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలావుండగా, ఇంతకు ఈడీ ట్వీట్‌ చేసినట్లు చెపుతున్న సమాచారం ఈడీ ద్వారా బయటకు వచ్చిందా లేదా కావాలని ఎవరి ప్రోద్బలంతోనైనా జరిగిందా? తెరవెనుక కుట్ర ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Share this article :

0 comments: