గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష

గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష

Written By news on Wednesday, April 19, 2017 | 4/19/2017


గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష
గుంటూరు :
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై రెండు రోజుల దీక్ష చేపడుతున్నారు. గుంటూరు వేదికగా ఈనెల 26, 27 తేదీలలో జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తారు. ఒకవైపు పంటల దిగుబడి వచ్చి రైతులు తమ పంటలను అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించడం.. అయినా ఈ అంశంపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన దీక్ష మొదలుపెడుతున్నారు.

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ధరలు పతనం అవుతున్నాయి. దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. ధరలు లేకపోవడంతో ఇద్దరు మిర్చి రైతులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడి వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి రంగంలోకి దిగాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీక్షా స్థలాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. స్థలాన్ని నిర్ణయించిన తర్వాత పోలీసుల అనుమతి తీసుకుని అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు. గతంలో కూడా రైతుల ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ తీవ్రంగా పోరాడిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: