ఇది ప్రజాస్వామ్యమేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది ప్రజాస్వామ్యమేనా?

ఇది ప్రజాస్వామ్యమేనా?

Written By news on Monday, April 3, 2017 | 4/03/2017


సార్‌.. ఇది ప్రజాస్వామ్యమేనా?: వైఎస్‌ జగన్‌
హైదరాబాద్‌: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యమేనా? అని గవర్నర్‌ను ప్రశ్నించినట్టు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రభుత్వం తన మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని ఆక్షేపిస్తూ వైఎస్‌ జగన్‌ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారాన్ని తప్పుబడుతూ గవర్నర్‌కు లేఖ అందజేశామని.. 'సార్‌ ఇలా చేయడం ప్రజాస్వామ్యమేనా' అని ఆయనను అడిగామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచి.. ఆ పార్టీ ద్వారా సాధించిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా.. పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం, వారిపై అనర్హత వేటు వేయకుండా పదవుల్లో కొనసాగించడం ధర్మమేనా? అని గవర్నర్‌ను ప్రశ్నించినట్టు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 • తెలంగాణలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇదేవిధంగా పార్టీ మారి.. మంత్రి పదవి పొందినప్పుడు..  ఇదే చంద్రబాబు నాయుడు ఏమాటలు మాట్లాడారు గుర్తుతెచ్చుకోండి
 • పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ప్రమాణం స్వీకారం చేయడమంటే.. రాజకీయ వ్యభిచారమేనని నాడు చంద్రబాబు పోల్చారు.
 • అదే చంద్రబాబు నేడు చేస్తున్న చేష్టలు సబబేనా గవర్నర్‌ను అడిగాం.
 • ఇలా చేయడం ప్రజాస్వామ్యం కాదు.. ఇలా చేయడం తప్పు అని చెప్పాం.
 • స్పీకర్‌ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు
 • అందుకే గత అసెంబ్లీ సమావేశాలలో 66మంది ఎమ్మెల్యేల బలం వైఎస్‌ఆర్‌ సీపీకి ఉందని చెప్పారు.
 • ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా స్పీకర్‌ కాపాడుతున్నారు.. మరోవైపు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వారికి మంత్రి పదవులు ఇస్తున్నారు
 • ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేలా, వారి రాజీనామాలు ఆమోదం పొందేలా చూడాలని గవర్నర్‌ను కోరాం.
 • ఒకవేళ రాజీనామా చేయకపోతే వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశాం.
 • ఇటువంటి తప్పులు జరగకుండా చూసేందుకే గవర్నర్‌ పదవి ఉంటుంది.
 • అటువంటి గవర్నర్‌తో ఇటువంటి దారుణాలు చేయిస్తే.. ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతారు?
 • ఈ లేఖను, ఈ పోరాటాన్ని జాతీయస్థాయిలో ఢిల్లీకి తీసుకుపోతాం. రాష్ట్రపతిని, ఎన్నికల సంఘాన్ని కలుస్తాం.
 • అన్ని పార్టీలను కలిసి వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళుతాం.
 • ఇలాంటి ఫిరాయింపు అక్రమాలను అడ్డుకోకపోతే.. రేపొద్దున మీకు కూడా ఇలాగే జరుగుతుందని పార్టీల దృష్టికి తీసుకెళుతాం.
 • వీలుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తాం
 • దీనిని ఇంతటితో వదిలిపెట్టం. రాజీనామాలు ఆమోదించి.. ఉప ఎన్నికలు వచ్చేలా చేస్తాం.
Share this article :

0 comments: