జగన్‌ బాహుబలి ..ఆయనది బ్రహ్మానందం క్యారెక్టర్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ బాహుబలి ..ఆయనది బ్రహ్మానందం క్యారెక్టర్‌

జగన్‌ బాహుబలి ..ఆయనది బ్రహ్మానందం క్యారెక్టర్‌

Written By news on Monday, May 1, 2017 | 5/01/2017


‘జగన్‌ బాహుబలి ..ఆయనది బ్రహ్మానందం క్యారెక్టర్‌’
గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గుంటూరులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన దీక్షలో ఆయన సోమవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఈవెంట్‌ మేనేజర్‌ గా వ్యవహరిస్తున్నారన్నారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి వైఖరి దారుణమన్నారు. గతంలో చేసిన పాదయాత్రలను చంద్రబాబు ఇప్పుడు చేస్తే... ఆయనను కర్రలు, చీపుర్లతో తరిమే పరిస్ధితి ఉందన్నారు. అబద్ధాల హామీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. ఏదైనా బుక్‌ షాపుకు వెళ్లి అబద్ధాలు చెప్పడం ఎలాగో నేర్చుకునే పుస్తకం ఇమ్మంటే... తడుముకోకుండా టీడీపీ మేనిఫెస్టో ఇస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

దేశవ్యాప్తంగా బాహుబలి చిత్రం సునామీ  సృష్టిస్తుంటే... మూడేళ్లుగా చంద్రబాబు దెబ్బకు రైతులు, మహిళలు, విద్యార్థులతో పాటు అందరూ బలి అయ్యారని చురకలు అంటించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరూ చిన్న పొరపాటు కూడా చేయవద్దని అనిల్‌కుమార్‌ యాదవ్‌ సూచించారు. ప్రజల కోసం కష్టపడుతున్న వైఎస్‌ జగన్‌ ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎలాంటి సువర్ణపాలన అందించారో, అంతకన్నా గొప్పగా వైఎస్‌ జగన్‌ పాలిస్తారని అన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌... అందినకాడికి రాష్ట్రాన్ని దోచుకుంటుందని అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఓటుకు అయిదు నుంచి పదివేలు అయినా ఖర్చుపెట్టేందుకు వెనకాడేది లేమని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే డబ్బుతో, అహంతో ప్రజలను కొనలేరని ఆయన అన్నారు.
ఇక నారా లోకేశ్‌ విషయానికి వస్తే ...ఏమీ తెలియని వ్యక్తికి మంత్రిగా బాధ్యతలు ఎలా అప్పగిస్తారన్నారు. వైఎస్‌ జగన్‌ కు నారా లోకేశ్‌కు పోలికే లేదని, అసలు ఇద్దరి మధ్య పోలిక ప్రసక్తే వద్దని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. జగన్‌ బాహుబలి అయితే, లోకేశ్‌ బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్‌ అని అన్నారు. ధర్మం, నీతి, నిజాయితీ వైపు నిలబడి పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ దేశంలో గర్వించదగ్గ నాయకుడని ఆయన పేర్కొన్నారు.
లోకేశ్‌ కు కనీసం సరిగ్గా పేపర్‌ కూడా చదవడం రాదని, అలాంటిది ఆయన మంత్రి...భవిష్యత్‌లో కాబోయే ముఖ్యమంత్రి అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం అమెరికా వెళుతున్నారని తాను అనుకోవడం లేదని, ఇటీవలి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని, గజినిగా మారిపోయిన ఆయన...ట్రీట్‌మెంట్‌ కోసమే అక్కడకు వెళుతున్నారని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.
Share this article :

0 comments: