కర్నూలు: పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకులపాటి నారాయణ రెడ్డిది రాజకీయ హత్యేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్‌కే రోజా అన్నారు. నంద్యాల ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేస్తున్న నారాయణ రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకోసం కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వ పార్టీ, హత్య చేయించిందని ధ్వజమెత్తారు. ఇది రాజకీయంగా చంద్రబాబుకు భవిష్యత్తులో ముప్పు ఉంటుందని తెలిపారు. ఏపీ హోంమంత్రి చిన రాజప్ప ఓ రబ్బరు స్టాంపులాగా తయారన్న ఆమె కేవలం చంద్రబాబు నాయుడు చెప్పే పనులు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. గడపగడపకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లిన నారాయాణ రెడ్డి ఓ బలమైన నాయకుడిగా ఎదుగుతుండటం చూసి ఆయన ముందు నిలవలేమని కుట్రతోనే ఈ హత్యకు వ్యూహం రచించారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ హత్య విషయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

0 comments:
Post a Comment