విజయవాడలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయవాడలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ

విజయవాడలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ

Written By news on Friday, May 5, 2017 | 5/05/2017


విజయవాడలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ
హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఈసారి విజయవాడ వేదిక కానుంది. జూలై 8,9 తేదీల్లో విజయవాడలో పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నట్లు ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన శుక్రవారం వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...జూన్‌ 19,20,21 తేదీల్లో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్లీనరీ సమావేశాలు జరుగుతాయన్నారు.
ఆ మూడు రోజుల్లో ఏదో ఒకరోజు జిల్లా ప్లీనరీ సమావేశాలు ఉంటాయన్నారు. ఇక​ మే చివరివారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు, రెండోదశలో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ అంశాలపై కులంకుషంగా చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో తెలంగాణ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయని వెల్లడించారు.
Share this article :

0 comments: