ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నాం: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నాం: భూమన

ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నాం: భూమన

Written By news on Monday, May 15, 2017 | 5/15/2017


ఆంధ్రజ్యోతిని  బహిష్కరిస్తున్నాం: భూమన
హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కేందుకు పచ్చ మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఆంధ్రజ్యోతి దినపత్రిక పాత్రికేయ విలువలను పూర్తిగా వదిలేసిందని, పూర్తిగా దిగజారి లేనిది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తోందని భూమన అన్నారు. ప్రధానమంత్రికి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన వినతి పత్రంపై అసత్యాలు ప్రసారం చేస్తోందని, సిగ్గువిడిచి ఆంధ్రజ్యోతి అసహ్యంగా వార్త రాసిందని ఆయన మండిపడ్డారు.

‘ఉమశంకర్‌ గౌడ్‌, గాంధీ అనే అధికారులు టీడీపీకి తొత్తులుగా మారారని వైఎస్‌ జగన్‌ ఫిబ్రవరి 17న ప్రధానికి లేఖ రాశారు. అయితే ఆ లేఖపై ఏప్రిల్‌ 13న కేంద్రం స్పందించి జవాబు ఇచ్చింది. ప్రధానికి జగన్‌ సమర్పించిన వినతిపత్రాన్ని అన్ని పత్రికలు ఇచ్చామని, అందులో అగ్రిగోల్డ్‌, ప్రత్యేక హోదా సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. కానీ ఆంధ్రజ్యోతి విలువలకు తిలోదకాలు ఇచ్చి పిబ్రవరి 17న రాసిన లేఖను వైఎస్‌ జగన్‌ మే 10న ప్రధానికి ఇచ్చినట్లుగా చిత్రీకరించింది. నాటి లేఖను ఇప్పటి లేఖగా బురద జల్లుతోంది. ప్రజా సమస్యలపై వైఎస్‌ జగన్‌ ...ప్రధానిని కలిస్తే దిగజారి అవాస్తవాలను ప్రచురించింది.
ఒక పార్టీని, నాయకుడిని సర్వనాశనం చేయాలనే దుగ్ధతో ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తోంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తిలేక ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తోంది.  టీడీపీ జెండాను ఆంధ్రజ్యోతి తన భుజాలపై మోస్తోంది. తప్పుడు వార్త రాసిన ఆంధ్రజ్యోతిపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం. లీగల్‌ నోటీసు ఇస్తాం. క్రిమినల్‌ డిఫమేషన్‌ (శిక్షార్హమైన పరువునష్టం) కేసు వేస్తాం.  ఏబీఎన్‌ చానల్‌, ఆంధ్రజ్యోతి పత్రిక గత మూడేళ్లుగా వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌ సీపీపై విషం కక్కుతూనే ఉంది. ఉద్దేశపూర్వకంగా కుట్రతో జగన్‌ను బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రజ్యోతి చేసింది నేరం తప్ప మరొకటి కాదు. ఆ నేరానికి క్షమాపణ కూడా లేదు.
ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు, ఏబీఎన్‌ చానల్‌ను  పత్రికలపై గ్రామస్థాయి నుంచి అన్ని స్థాయిల వరకూ మేం బహిష్కరిస్తున్నాం. మా పార్టీ కార్యాలయాలకు ఆ పత్రికా విలేకర్లు రావాల్సిన అవసరం లేదు. ఆ పత్రిక అంత సిగ్గుమాలిన పత్రిక ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని వాస్తవాలు రాస్తే మంచిది. ఫిబ్రవరి 17న వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను, మే 10న ప్రధానికి ఇచ్చిన లేఖను ఆంధ్రజ్యోతికి పంపిస్తాం. వాస్తవాలు రాయాలని కోరుతున్నాం.’  అని అన్నారు.
Share this article :

0 comments: