‘ఓటుకు నోట్లు’ చంద్రబాబా నీతులు చెప్పేది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఓటుకు నోట్లు’ చంద్రబాబా నీతులు చెప్పేది?

‘ఓటుకు నోట్లు’ చంద్రబాబా నీతులు చెప్పేది?

Written By news on Sunday, May 14, 2017 | 5/14/2017


‘ఓటుకు నోట్లు’ చంద్రబాబా నీతులు చెప్పేది?
► ప్రధాన మంత్రిని జగన్‌మోహన్‌ రెడ్డి కలిస్తే తప్పేమిటి?
► చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం


గంగవరం: ఓటుకు నోటు కేసులో చిక్కిన మీరా మాకు నీతులు చెప్పేది అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన పుష్పయాగంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. తర్వాత  మోతుకుపల్లెలోని మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు సుబ్రమణ్యంరెడ్డి ఇంటికి వెళ్లి బంధువులను పలకరించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కలవడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలను మోదీకి వివరిస్తే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. ప్రతిపక్షనేతగా జగన్‌ ప్రధానమంత్రిని కలిసి అధికార పక్షం చేస్తున్న అరాచకపాలనను వివరించినందుకే ఉలిక్కిపడుతున్నారన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అండ్‌కో ఇప్పుడు నీతులు చెబుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాసమస్యలే ప్రధానాస్త్రంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారని స్పష్టంచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్తలు రాకేష్‌రెడ్డి, సీ.వీ.కుమార్,  రెడ్డెమ్మ, నాయకులు, వెంకటేగౌడు, మొగసాల కృష్ణమూర్తి, మోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: