
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మెట్రో రైలులో ప్రయాణించారు. విమానాశ్రయం మెట్రో ఎక్స్‌ప్రెస్ మార్గం నుంచి ఆయన శివాజీ స్టేడియం స్టేషన్ వరకూ రైలులో ప్రయాణం చేశారు. అక్కడ నుంచి కారులో ప్రధానమంత్రిని కలిసేందుకు వెళ్లారు.
వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. కాగా రాష్ట్రంలోని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలంటూ పార్టీ ఎంపీలతో కలిసి వైఎస్ జగన్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రైతు సమస్యలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.


0 comments:
Post a Comment