నారాయణరెడ్డికి వైఎస్‌ జగన్‌ ఘన నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నారాయణరెడ్డికి వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

నారాయణరెడ్డికి వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

Written By news on Monday, May 22, 2017 | 5/22/2017


కర్నూలు:  ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఈరోజు మధ్యాహ్నం  హైదరాబాద్‌ నుంచి నేరుగా చెరుకులపాడు చేరుకున్న వైఎస్‌ జగన్‌.... నారాయణరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. భర్తను కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నారాయణరెడ్డి భార్య శ్రీదేవిరెడ్డిని ఓదార్చి, ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

మరోవైపు నారాయణరెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వేలాదిమంది అభిమానులతో చెరుకులపాడు జనసంద్రమైంది. మరోవైపు నారాయణరెడ్డిని కాపాడేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయిన ఆయన అనుచరుడు సాంబశివుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Share this article :

0 comments: