గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

Written By news on Sunday, May 21, 2017 | 5/21/2017


గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు(సోమవారం) గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్న​ర్‌తో ఆయన భేటీ అవుతారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌ సీపీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య నేపథ్యంలో టీడీపీ హత్యారాజకీయాలపై గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు చేయనున్నారు.

గవర్నర్‌ను కలిసిన తర్వాత జగన్‌ కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. నారాయణ రెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరుకానున్నారు. మరోవైపు నారాయణరెడ్డి హత్యకు నిరసనగా రేపు కర్నూలు జిల్లా బంద్‌కు వైఎస్సార్‌ సీపీ పిలుపునిచ్చింది.
Share this article :

0 comments: