వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు

వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు

Written By news on Friday, June 30, 2017 | 6/30/2017


'వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు'
హైదరాబాద్: జులై 8, 9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల స్థలంలో ఈ భారీ ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 'జాతీయ స్థాయి ప్లీనరీకి 30 వేల మంది దాకా ప్రతినిథులు వస్తారు. మూడు అంచెల్లో వైఎస్ఆర్ సీపీ ప్లీనరీలు జరపాలని నిర్ణయించాం. భారీ ప్లీనరీ నిర్వహణకు 18 కమిటీలు ఏర్పాటు చేశాం. ప్లీనరీ తొలిరోజు 8న పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నాం. ప్లీనరీ రెండో రోజైన 8వ తేదీన పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.

ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు గ్రామీణ స్థాయి నేతలకే ఎక్కువ తెలుస్తాయి. అందువల్లే జిల్లా స్థాయి ప్లీనరీలు, నియోజవర్గ స్థాయి ప్లీనరీలు విజయవంతమయ్యాయి. ఆయా ప్లీనరీల్లో తీర్మనాలు మాకు ఎప్పటికప్పుడు అందుతున్నాయి. ఈ తీర్మానాల ప్రాతిపదికనే ఇక్కడి ప్లీనరీలో చర్చిస్తాం. దశ దిశ కోల్పోయిన వ్యవసాయం, ప్రజా సంక్షేమం, మహిళా, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం సమస్యలు, డ్వాక్రా మహిళలు వారి ఇబ్బందులు, ఎన్నికల హామీల వైఫల్యం, ప్రత్యేక హోదా అంశం, మానవ వనరులు, ఇసుక మాఫియా, మద్యం టెండర్ల అవకతవకలు, రాజధాని భూ సేకరణపై జరుగుతున్న అక్రమాలు లాంటి ఎన్నో అంశాలపై ప్లీనరీలో చర్చకు రానున్నాయని' ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. భోజనం, తీర్మానాలు, సభ నిర్వాహణ, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కమిటీ, మీడియా కమిటీ, కల్చరల్, రవాణా, పార్కింగ్ సహా మొత్తం 18 కమిటీలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
Share this article :

0 comments: