వర్షపు నీటిలో ఏపీ సచివాలయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వర్షపు నీటిలో ఏపీ సచివాలయం

వర్షపు నీటిలో ఏపీ సచివాలయం

Written By news on Tuesday, June 6, 2017 | 6/06/2017


వర్షపు నీటిలో ఏపీ సచివాలయం
అమరావతి: గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. సచివాలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది. వర్షం కారణంగా సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది.
 
అసెంబ్లీ, సచివాలయంలోని పలు ఛాంబర్లు వర్షపు నీటితో నిండాయి. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కార్యాలయంలోకి వర్షపు నీరు సన్నటి ధారగా నీరు పడుతోంది. దీంతో బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. కాగా అసెంబ్లీలోకి మీడియాను అనుమతించలేదు. విజువల్స్‌ తీయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. 
 
 

కాగా గుంటూరు జిల్లాలోని సత్తెన పల్లి పరిసర గ్రామాల్లో పిడుగు పడే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. కృష్ణా జిల్లా కంచికచర్లలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మొదలైన వాన, తీవ్ర ఈదురుగాలులతో స్థానికులు భీతిల్లారు. భీకరమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో చెట్లు నేలకూలాయి. రేకుల షెడ్ల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడికక్కడ  నీరు నిలిచిపొయింది. దీనికి తోడు ఉరుముల మెరుపులతో జనం భయకంపితులయ్యారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపొయింది. పట్టణంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
 
Share this article :

0 comments: