వైఎస్సార్‌ సీపీలో చేరిన శిల్పామోహన్‌ రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌ సీపీలో చేరిన శిల్పామోహన్‌ రెడ్డి

వైఎస్సార్‌ సీపీలో చేరిన శిల్పామోహన్‌ రెడ్డి

Written By news on Wednesday, June 14, 2017 | 6/14/2017


హైదరాబాద్‌: మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి బుధవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తన మద్దతుదారులతో కలిసి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. పార్టీ కండువా వేసి జగన్‌ సాదర స్వాగతం పలికారు.

నంద్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ నేతలు గోస్పాడు ప్రహ్లాదరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డితో సహా కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. శిల్పామోహన్‌రెడ్డి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.
Share this article :

0 comments: