ప్లీనరీపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలకభేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్లీనరీపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలకభేటీ

ప్లీనరీపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలకభేటీ

Written By news on Monday, June 19, 2017 | 6/19/2017


ప్లీనరీపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలకభేటీ
హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్లీనరీపై సోమవారం కీలక సమావేశం జరిగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్లీనరీలో చర్చించాల్సిన అంశాలు, కమిటీలు, ఏర్పాట్లపై చర్చించారు. జూలై 8,9 తేదీల్లో నిర్వహించే పార్టీ ప్లీనరీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మాణాలపై వైఎస్ జగన్‌, పార్టీ నేతలు నిశితంగా చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో ఎంపీలు విజయసాయిరెడ్డి. వైవీ సుబ్బారెడ్డి, మండలి విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి,వెల్లంపల్లి శ్రీనివాస్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

అనంతరం ప్లీనరీ సమావేశం వివరాలను బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో వివరించారు. పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు, తీర్మానాలపై చర్చించినట్లు తెలిపారు. అలాగే విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ తమ పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో ఈ నెల 22న విశాఖలో మహాధర్నా చేపట్టనున్నట్లు బొత్స పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ ఆధ్వర్యంలో మంత్రుల ప్రమేయంతోనే లక్ష ఎకరాల భూ కుంభకోణం జరిగిందన్నారు.
దీనిపై సీబీఐతో  విచారణ  చేయించాల్సిందేనని  అన్నారు. డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, సిట్‌ విచారణ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అధికార పార్టీ నేతలు బెరితెగించి భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని బొత్స మండిపడ్డారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పైనా సిట్‌తో విచారణ జరిపించారని ఏం ఫలితం వచ్చిందని ప్రశ్నించారు. సాక్షాత్తూ సీఎం సొంత పొలంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినా సిట్ దర్యాప్తులో ఆ అంశాలు వెలుగులోకి రాలేదని బొత్స గుర్తు చేశారు.
Share this article :

0 comments: