వాటికి హెరిటేజ్‌ డబ్బులు ఇవ్వడం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాటికి హెరిటేజ్‌ డబ్బులు ఇవ్వడం లేదు

వాటికి హెరిటేజ్‌ డబ్బులు ఇవ్వడం లేదు

Written By news on Saturday, June 24, 2017 | 6/24/2017


వాటికి హెరిటేజ్‌ డబ్బులు ఇవ్వడం లేదు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. నా పెన్షన్‌, నా రోడ్లు అని ముఖ్యమంత్రి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రజల పన్నులతో వచ్చిన డబ్బులతోనే పథకాలను అమలు చేస్తున్నారని, వాటికి హెరిటేజ్‌ డబ్బులు ఇవ్వడం లేదని చురకలంటించారు.

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్‌.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్న చంద్రబాబుకు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. అక్రమంగా సంపాదించారు కాబట్టే నంద్యాలలో ఓటరుకు రూ 5 వేలు ఇస్తానని చంద్రబాబు అన్నారన్నారు. విశాఖ భూకుంభకోణంలో ప్రధాన సూత్రధాని బండారు సత్యనారాయణ అని, ఆయనకు విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హతలేదని వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. అసలు జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేషా వైఎస్‌ జగన్‌ను విమర్శించేదని వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: