గరగపర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గరగపర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన

గరగపర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన

Written By news on Friday, June 30, 2017 | 6/30/2017


గరగపర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన
ఏలూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...‘ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చా.
నేను రెండు పక్షాలతోను మాట్లాడతా. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ ప్రయత్నం. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదు. ఇది అన్నివర్గాలకు వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే...దాన్ని సరిదిద్దుకుందాం. దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు.’ అని అన్నారు.

ఈ సంఘటనపై గరగపర్రు దళితేతరులు మాట్లాడుతూ... సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు. కొందరు వల్ల ఈ సమస్యవ వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందన్నారు. సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయన్నారు.
Share this article :

0 comments: