కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: వైఎస్‌ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: వైఎస్‌ జగన్‌

కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: వైఎస్‌ జగన్‌

Written By news on Thursday, June 15, 2017 | 6/15/2017


పులివెందుల: మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీయిచ్చారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో పర్యటిస్తున్న ఆయనను గురువారం మహిళలు కలిశారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని బడా సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మహిళలు ఆయనకు తెలిపారు. ఏడు నెలలుగా జీతాలు, బిల్లులు ఇవ్వక పోగా తమను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. వారు చెప్పిన విషయాలను వైఎస్ జగన్‌ శ్రద్ధగా విని, రాసుకున్నారు. మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీయిచ్చారు.

కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకుడు రామకృష్ణారెడ్డిని వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రామకృష్ణారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Share this article :

0 comments: