చంద్రబాబు అలా మాట్లాడితే ఎలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు అలా మాట్లాడితే ఎలా?

చంద్రబాబు అలా మాట్లాడితే ఎలా?

Written By news on Thursday, June 15, 2017 | 6/15/2017


‘చంద్రబాబు అలా మాట్లాడితే ఎలా?’
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో కుల వివక్ష విపరీతంగా పెరిగిపోయిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు దళిత జాతిని అవమానించారని, ఆయన వారిని అవమానిస్తూ మాట్లాడితే ఎలా ప్రశ్నించారు. ఒక్క చిత్తూరులోనే కాకుండా రాష్ట్రంలోని పలుచోట్ల చంద్రబాబు తీరువల్ల కుల వివక్ష పెరిగిపోయి దళితులు, బలహీన వర్గాల వారిపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల్లో కుల వివక్ష విపత్కర పరిస్థితికి దారి తీస్తోందన్నారు. ఎన్నికల హామీల్లో పెరిగే చార్జీలకు అనుగుణంగా దళిత విద్యార్థులకు, బలహీన వర్గాలకు చెందినవారికి మెస్‌చార్జీలు పెంచుతామని చెప్పిన చంద్రబాబు.. మూడేళ్లలో వాటిని పెంచకపోగా హాస్టళ్లను మూసివేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ రోజుకారోజు పెట్రోల్‌ ధరలు పెరుగుతాయని తాజాగా ప్రకటనలు వచ్చాయని, వాటిని అమలుచేయాలని ప్రభుత్వాలు చెప్పాయని, అలాంటిది పేద విద్యార్థుల మెస్‌ చార్జీల విషయంలో అలాంటి ప్రకటనలు ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. మూడేళ్ల కాలంలో కుటుంబాలు పెరిగినా రేషన్‌కార్డుల సంఖ్య పెరగలేదని, పైగా 2014తో పోలిస్తే 2015లో తగ్గాయని చెప్పారు. దళిత వర్గాలకు మూడేళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లును నిర్మించలేదని, వైఎస్‌ఆర్‌ హయాంలో 48లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందని అన్నారు.

వైఎస్‌ఆర్‌ 31లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి అందులో దళితులకే ఎక్కువగా ఇస్తే చంద్రబాబు మాత్రం అలా చేయకుండా 10లక్షల ఎకరాలను భూసేకరణ పేరుతో సేకరించి దళితుల భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు సంక్షేమ నిధులు ప్రవాహం లాగా అందాలి కానీ అలా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు సక్రమంగా ఖర్చు చేయలేదని కాగ్‌ చెప్పిందని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం రూ. పది కోట్లు బడ్జెట్‌ కేటాయిస్తామని బలహీన వర్గాలకు హామీ ఇచ్చి గడిచిన మూడేళ్లలో రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు.
Share this article :

0 comments: