వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లో పనిచేసే వారిపై కేసులు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లో పనిచేసే వారిపై కేసులు?

వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లో పనిచేసే వారిపై కేసులు?

Written By news on Thursday, June 8, 2017 | 6/08/2017


వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లో పనిచేసే వారిపై కేసులు?కోసేసిన పైపుల ఫొటోను చూపుతున్న స్పీకర్‌ కోడెల(ఫైల్‌)
- లీకేజీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది
- సీబీఐ దర్యాప్తుతోనే నిజమైన దోషులెవరో తేలతారు
- నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు


నరసరావుపేట:
 అసెంబ్లీ భవనంలోకి వర్షపు నీరు రావటాన్ని సామాజిక ప్రసార మాధ్యమాల (వాట్సాప్‌‌) ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన వారిపై అక్రమంగా కేసులు పెట్టే కుట్రకు ప్రభుత్వం తెరతీస్తుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తమ జేబు సంస్థ లాంటి సీఐడీతో అసెంబ్లీ ఆవరణలోని వైఎస్‌.జగన్‌ ఛాంబర్‌లో పనిచేసే వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, కుతంత్రాలతో ప్రభుత్వం నడుస్తుందనే దానికి ఇదే నిదర్శనమని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చి దోషులెవరో తేలాలంటే సీబీఐతో నిష్పాక్షికమైన విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ‘అసెంబ్లీ హాల్లోకి వర్షపు నీరు వచ్చిందనే విషయంపై వాస్తవాలను తెలుసుకునేందుకు బుధవారం ఎమ్మెల్యేలందరమూ పరిశీలించేందుకు వెళ్లాం కానీ సిబ్బంది మమల్ని లోపలికి అనుమతించలేదు. ఆ మేరకు స్పీకర్‌ తమకు కచ్చితమైన ఆదేశాలు జారీచేశారని సిబ్బంది చెప్పారు’ అని శ్రీనివాసరెడ్డి వివరించారు.

స్పీకర్‌ కోడెల.. మీడియాను అసెంబ్లీలోని లాబీల్లోకి గాని, మొదటి ప్లోర్‌లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహనరెడ్డి చాంబర్‌లోకి గానీ తీసుకెళ్లకుండా సరాసరిగా రూఫ్‌కు తీసుకెళ్లడం, అప్పటికే కట్‌చేసి ఉంచిన పైపును చూపించి లీకేజీకి ఇదే కారణమని చెప్పడం విడ్డూరమని శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ నిర్మాణానికి భూమి, ఇసుక ఉచితంగా ఇచ్చి నిర్మాణానికి స్కేర్‌ ఫీట్‌కు రూ.4వేలకు బదులుగా రూ.10వేలు చెల్లించినా వర్షపు నీరు ఎందుకు కారిందని ప్రశ్నించారు.
Share this article :

0 comments: