
సీఎం చంద్రబాబుపై మండిపడ్డ భూమన
హైదరాబాద్: తనవల్ల లబ్ధి పొందుతున్నారు కాబట్టి తనకే ఓట్లేయాలంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు మీ అబ్బ సొత్తు ఏమైనా ధారాదత్తం చేస్తున్నారా? అని సీఎంపై మండిపడ్డారు. తరతరాలుగా కూడబెట్టిన ఆస్తులను రహదారులు, పెన్షన్ల కోసం చంద్రబాబు పంపిణీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
బాబు చేసిన వ్యాఖ్యలకు జైలుకు పంపాలి
ఎన్నికల్లో ఓటు కోసం రూ. 5 వేలు చొప్పున ఇవ్వగలను అని ప్రకటించిన చంద్రబాబును జైలుకు పంపాలని భూమన పేర్కొన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిం చారనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదన్నారు. రాజధానితోపాటు విశాఖ నుంచి కర్నూలు వరకు భూ దందాలతో దోపిడీ చేసిన రూ. లక్షల కోట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
లోకేశ్‌కు దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలి
చంద్రబాబు, లోకేశ్‌కు సిగ్గు, లజ్జా, దమ్మూ, ధైర్యం ఉంటే భూదందాలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని భూమన సవాలు విసిరారు.
0 comments:
Post a Comment