3న నంద్యాలలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 3న నంద్యాలలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ

3న నంద్యాలలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ

Written By news on Sunday, July 30, 2017 | 7/30/2017


3న నంద్యాలలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయబోతోంది. ఇందులో భాగంగా వచ్చేనెల 3న నంద్యాలలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. నంద్యాలలోని ఎస్పీజీ మైదానంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ బహిరంగ సభ జరుగుతుందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

వచ్చేనెల 23న నంద్యాల ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ సీపీ విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ బహిరంగ సభతో నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో మరింత ఊపు వస్తుందని, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం మరింత ఉరకలెత్తుతుందని భావిస్తున్నారు.
Share this article :

0 comments: