విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులకు వివరించారు.
తర్వాత వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వెలగపూడిలోని అసెంబ్లీకి వెళతారు. శాసనసభ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు.

0 comments:
Post a Comment