వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే

Written By news on Friday, July 21, 2017 | 7/21/2017


హైదరాబాద్‌ : ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఇంఛార్జ్‌ శిల్పా మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సంజీవరెడ్డి  సంజీవరెడ్డి, ఆయన తనయుడు వెంకట్‌ రెడ్డి, నంద్యాలలో మంచి పేరున్న న్యాయవాది శివశంకర్‌ రెడ్డి పార్టీలో చేరారు.
సంజీవరెడ్డికి కండువా కప్పి వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు చుట్టు అవినీతిపరులు చేరారని, ఉప ఎన్నిక కోసం ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు వైఖరి నచ్చకే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారన్నారు. నంద్యాలలో వైఎస్‌ఆర్‌ సీపీ గెలుపు ఖాయమని సంజీవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: