వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ అప్‌డేట్స్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ అప్‌డేట్స్‌

వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ అప్‌డేట్స్‌

Written By news on Saturday, July 8, 2017 | 7/08/2017


హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, తెలుగు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ ప్లీనరీకి సంబంధించిన కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..

తొలిరోజు ప్లీనరీ..
సాయంత్రం 4.58 గంటలు:  దగాపడ్డ డ్వాక్రా మహిళల తీర్మానాన్ని బలపరిచిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గిడ్డీ ఈశ్వరీ
సాయంత్రం 4.58 గంటలు:  దగాపడ్డ డ్వాక్రా మహిళల తీర్మానాన్ని ప్లీనరీలో ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా

సాయంత్రం 4.49 గంటలు:  అనంతపురం జిల్లా సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ సీపీ నేత శంకర్‌నారాయణ
సాయంత్రం 4.43 గంటలు:  చేనేత కార్మికుల సమస్యలపై తీర్మానాన్ని బలపరిచిన వైఎస్‌ఆర్‌ సీపీ నేత మోహన్‌రావు
సాయంత్రం 4.33 గంటలు:  చేనేత కార్మికుల ఇక్కట్లపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ బుట్టా రేణుక.. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని, దళారులు లేని మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి..

సాయంత్రం 4.28 గంటలు:  ప్లీనరీలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి
సాయంత్రం 4.20 గంటలు:  ప్లీనరీలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత రెహమాన్‌
సాయంత్రం 4.13 గంటలు:  ప్లీనరీలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌ సీపీ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు నదీమ్‌ అహ్మద్‌

సాయంత్రం 4.02 గంటలు:  ప్లీనరీలో ప్రసంగించిన వైఎస్‌ఆర్‌ సీపీ నేత జోగి రమేశ్‌
మధ్యాహ్నం 3.54 గంటలు: ప్రజాసంక్షేమంపై తీర్మానాన్ని బలపరిచిన వైఎస్‌ఆర్‌సీపీ నేత జంగా కృష్ణమూర్తి
మధ్యాహ్నం 3.43 గంటలు: ప్రజాసంక్షేమంపై తీర్మానాన్ని బలపరిచిన వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బాలరాజు

మధ్యాహ్నం 3.33 గంటలు: ప్రజాసంక్షేమంపై తీర్మానం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్‌ సీపీ నేత మేరుగ నాగార్జున

మధ్యాహ్నం 3.25 గంటలు: ఏపీలో ఆటవిక పరిపాలనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌
మధ్యాహ్నం 2.56 గంటలు: చంద్రబాబు ఆటవిక పాలన గురించి వివరిస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మధ్యాహ్నం 2:46 గంటలు: ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని
మధ్యాహ్నం 2:25 గంటలు: రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి

మధ్యాహ్నం 2:10 గంటలు: ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’ పుస్తకంపై వివరణ ప్రారంభించిన అంబటి రాంబాబు
మధ్యాహ్నం 2:07 గంటలు: చంద్రబాబు అవినీతి చక్రవర్తి (ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌)​ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. మూడేళ్లలో చంద్రబాబు నాయుడు చేసిన రూ.3,75,000కోట్ల అవినీతిని ఈ పుస్తకంలో ఆధారాలతో సహా వెల్లడించినట్లు తెలిపిన వైఎస్‌ జగన్‌.
మధ్యాహ్నం 1:55 గంటలు: పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టిన ధర్మాన ప్రసాదరావు
మధ్యాహ్నం 1:45 గంటలు: ప్లీనరీలో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 29 సీ ప్రకారం మూడేళ్ల పార్టీ జమా ఖర్చుల నివేదికను ప్రవేశపెట్టిన  పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు.
 
మధ్యాహ్నం 1:30గంటలు: వ్యవసాయ సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
మధ్యాహ్నం 1:20గంటలు: విజయనగరం జిల్లా తీర్మానం ప్రవేశ పెట్టిన జిల్లా అధ్యక్షుడు బీ చంద్రశేఖర్‌

మధ్యాహ్నం 1:15 గంటలు: పశ్చిమ గోదావరి జిల్లా తీర్మానం ప్రవేశ పెట్టిన జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని

మధ్యాహ్నం 1:05 గంటలు: తూర్పుగోదావరి జిల్లా తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు కన్నబాబు

మధ్యాహ్నం 1గంటలు:
 విశాఖపట్నం తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌

మధ్యాహ్నం 12:55 గంటలు: శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
మధ్యాహ్నం 12:53 గంటలు : పూర్తయిన ప్లీనరీ ప్రసంగం. ప్లీనరీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
మధ్యాహ్నం: 12:45 గంటలు: ప్లీనరీ ప్రారంభ ఉపన్యాసాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
మధ్యాహ్నం 12: 40 గంటల: ప్లీనరీలో నేతలు, పార్టీ కార్యకర్తలతో ప్రమాణం చేయించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి
మధ్యాహ్నం 12: 37 గంటలు: దివంగతులైన పార్టీ నేతలు, కార్యకర్తలకు నివాళులు

మధ్యాహ్నం 12:30 గంటలు: పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు ప్రకటన విడుదల చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. నేడు నామినేషన్ల స్వీకరణ. సాయంత్రం తుది జాబితా ప్రకటన. రేపు సాయంత్రం జాతీయ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడి
మధ్యాహ్నం 12:19 గంటలు: ప్లీనరీలో సర్వమత ప్రార్థనలు

మధ్యాహ్నం 12: 17 గంటలు: వేదికవద్ద వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైఎస్‌ జగన్‌, పార్టీ నాయకులు
మధ్యాహ్నం 12:15 గంటలు: వేదిక పైకి చేరుకుని పార్టీ నాయకులకు, ప్రతినిధులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇతర శ్రేణులకు అభివాదం చేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

మధ్యాహ్నం 12:05 గంటలు: జాతీయ ప్లీనరీ ప్రాంగణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  జెండా ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఉదయం 11:58 గంటలు: ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రాంగణమంతటా పార్టీ శ్రేణుల ఉత్సాహం, కోలాహలం

ఆకర్షిస్తున్న ఫొటో గ్యాలరీ: ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మ‌హానేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖర్‌ రెడ్డి ఫొటో గ్యాల‌రీ బాగా ఆకర్షిస్తోంది. అలాగే, వేదికముందు ఏర్పాటుచేసిన వంద వైఎస్‌ఆర్‌ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కళాకారుల పాటలతో హోరెత్తుతున్న ప్రాంగణం: భారీగా తరలివచ్చిన పార్టీశ్రేణులు, అభిమానులతో వైయస్ఆర్ ప్లీనరీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కళాకారులు పాటలతో హోరెత్తిస్తున్నారు. వైయస్ఆర్ జయంతి సందర్భంగా మహానేతను స్మరించుకుంటూ ప్లీనరీ ఉత్సాహంగా కనిపిస్తోంది. కాసేపట్లో వైఎస్‌ జగన్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు.

పార్టీ ప్రతినిధుల నమోదు ప్రారంభం: వైయస్సార్సీపీ జాతీయ ప్లీనరీ సమావేశానికి ప్రతినిధుల రాక మరింత ఊపందుకుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.

ఉదయం 10:30 గంటలు: గన్నవరం చేరుకున్న వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి. ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, జోగి రమేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, దుట్టా రామచంద్రరావు, బుడ్డి చంద్రశేఖర్‌, స్థానిక నేతలు. కాసేపట్లో రోడ్డు మార్గంలో గుంటూరుకు చేరుకోనున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌.
ఉదయం 9:30 గంటలు: కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయల్దేరిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
ఉదయం 9:00 గంటలు: ఇడుపుల పాయ నుంచి కడప ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన వైఎస్‌ జగన్‌. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
ఉదయం 8.30 గంటలు: ఇడుపుల పాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌ ప్రాంగణంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి కుటుంబ సభ్యుల పుష్పాంజలి. పూలమాలను వేసి అంజలి ఘటించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

ఉదయం 8.00 గంటలు: ఇడుపుల పాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులు.
Share this article :

0 comments: