హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జూపల్లె రాకేశ్‌రెడ్డి శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. రాకేశ్‌రెడ్డితో పలువురు నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు కూడా వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో రాకేశ్‌రెడ్డి నంద్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక నంద్యాల ప్రజల ఆత్మగౌరవానికి, టీడీపీ అహంకారానికి మధ్య పోరుగా వర్ణించారు. శిల్పామోహన్‌రెడ్డి గెలుపునకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. చంద్రబాబు పాలనపై నంద్యాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని అన్నారు.
కాగా, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిన్న వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్లాది విష్ణుతోపాటు వేలాదిమంది నేతలు, కార్యకర్తలను వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

0 comments:
Post a Comment