
విజయవాడ: ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వినిపించే గొంతు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీది అవుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని బంగాళాఖాతంలో కలపబోయేది కూడా అదే గొంతు అని హెచ్చరించారు. గురువారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మల్లాది విష్ణు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా విష్ణును వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నగర కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఇతర నేతలకు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కండువాలు కప్పి సాధారంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'విష్ణు, ఆయన సహచరులంతా కూడా నాన్నగారు వైఎస్‌ఆర్ బాటలో నడిచినవారే. వారు వైఎస్‌ఆర్ పార్టీలోకి రావడం సొంత ఇంట్లోకి రావడమే. ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా, ఆప్యాయంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను' అని అన్నారు.
చంద్రబాబుది దుర్మార్గం.. చీకటి మార్గం
రాష్ట్ర ప్రజలకు రెండు దార్లున్నాయని, ఒకటి చంద్రబాబు దుర్మార్గమైన దారి అయితే, రెండోది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్మార్గం అని చెప్పారు. 'ఇప్పటి వరకు చంద్రబాబు దుర్మార్గ దారిలో మూడేళ్ల పరిపాలన చూశాం. ఆ దారిలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు కనిపించింది సొంతమామనే పొడిచిన వెన్నుపోటు, రాజకీయ అవసరం కోసం ఏమైనా చేయగలిగిన మనస్తత్వం, లక్షల కోట్ల దోపిడీ, రైతులకు వందలకొద్ది చేసిన అన్యాయాలు, ఒక్కటంటే ఒక్క వాగ్దానం అమలుచేయని దుర్మార్గం, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని వంచించిన తత్వం, మితిమీరిన అహంకారం, ప్రజలను కాకుండా పోలీసులను నమ్ముకొని పరిపాలన చేయడం, ప్రజలకు చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించే మనస్తత్వం మనకు చంద్రబాబు దారిలో కనిపిస్తుంది' అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
అలాగే, 'ప్రజలను నాశనం చేసేలా మద్యం, అక్రమ ఇసుక, బొగ్గు దందాలు, గుడి భూములు కొల్లగొట్టడం, జెన్ కో కాంట్రాక్టులు, రాజధాని, విశాఖ భూముల కుంభకోణాలు, లంచాలు మింగి పేదల భూమిని పెద్దలకు పెట్టడం, కాల్‌మనీ సెక్స్ రాకెట్, పుష్కరాల్లో 30మందిని హత్య చేసిన దుర్ఘటన, దేవుడు భూములు కూడా మింగేయడం' ఈ చంద్రబాబు దారిలోనే కనిపిస్తుందని తెలియజేశారు. ఓటుకు నోటు కేసులో దొరికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకోవడం, ప్రశ్నించలేక నదుల్ని తాకట్టుపెట్టడం, కేసుల కోసం ప్రత్యేక హోదాను అమ్మేయడం, మంచిపాలన చేతకాక, వేరే పార్టీ నేతలను(వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటుపై గెలిచినవారిని) అక్రమ సొమ్ముతో కొనడం కూడా చంద్రబాబు దారిలో కనిపిస్తుందని ధ్వజమెత్తారు.
మరోపక్క, రైతుల కన్నీరు, హెరిటేజ్ షేర్లు 400శాతానికి పెరగడం కూడా చంద్రబాబు పాలనలో దర్శనం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 'పేదలకు ఇళ్లు లేకపోవడం, చంద్రబాబుకు పది ఇళ్లు ఉండటం, కంచాలు మోగిస్తే కేసులు, లంచాలు మింగితే కేసులు ఉండకపోవడం, మాటమీద నిలబడమంటే కేసులు, నిలబడకుంటే కేసుల్లేని పరిస్థితి, కొడుకును మంత్రిని చేసేందుకు అడ్డదార్లు ఉండటం చంద్రబాబు పరిపాలనలో ఉంటాయి' అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల ఎన్నికలు రాగానే చంద్రబాబు కపట ప్రేమ
మూడేళ్లయినా ముస్లింలకు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు నేడు నంద్యాల ఉప ఎన్నికలు చూసి మాత్రం ముస్లింలపై కపట ప్రేమ కురిపిస్తున్నారని, వారు చంద్రబాబును నమ్మరని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు ప్రేమ కురిపించడం, ఇఫ్తార్ విందులు ఇవ్వడం, ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ఎన్నికలయ్యాక మరిచిపోవడం చంద్రబాబు ముందునుంచి అలవాటేనని దుయ్యబట్టారు. చంద్రబాబు జన్మించింది ఏప్రిల్ 20 అని, అంటే చంద్రబాబు 420 అని, ఈ 420 పాలనలో రాష్ట్రమంతటా 144సెక్షన్ విధిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో చీకట మార్గం తప్ప మరొకటి లేదని చెప్పారు
మూడేళ్లయినా ముస్లింలకు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు నేడు నంద్యాల ఉప ఎన్నికలు చూసి మాత్రం ముస్లింలపై కపట ప్రేమ కురిపిస్తున్నారని, వారు చంద్రబాబును నమ్మరని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు ప్రేమ కురిపించడం, ఇఫ్తార్ విందులు ఇవ్వడం, ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ఎన్నికలయ్యాక మరిచిపోవడం చంద్రబాబు ముందునుంచి అలవాటేనని దుయ్యబట్టారు. చంద్రబాబు జన్మించింది ఏప్రిల్ 20 అని, అంటే చంద్రబాబు 420 అని, ఈ 420 పాలనలో రాష్ట్రమంతటా 144సెక్షన్ విధిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో చీకట మార్గం తప్ప మరొకటి లేదని చెప్పారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారి రహదారి, పార్టీ మార్గం సన్మార్గం అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 'మన దారి రహదారి.. దివంగతనేత రాజశేఖర్ రెడ్డిగారు వేసిన దారి. మనమార్గం సన్మార్గం. మన దారిలో వెళితే.. రైతులపాలిట కల్పతరువు ఉచిత విద్యుత్ కనిపిస్తుంది, పేదలకు ఇచ్చిన 45లక్షల ఇళ్లు కనిపిస్తాయి. 108 నెంబర్‌కు ఫోన్ కొడితే వచ్చే అంబులెన్స్‌లు, ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. పేదవాడికి అప్పులపాలయ్యే గత్యంతరం రాకుండా చదువుల విప్లవం ఫీజు రియంబర్స్‌మెంట్, జలయజ్ఞం, జిల్లాకొక యూనివర్సిటీ, 32లక్షల ఎకరాల భూములు పంపిణీ, ఐదేళ్ల మూడు నెలల పాలన కాలంలో ఒక్కసారి కూడా పెంచని బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, రైతుల, పేదల కళ్లల్లో ఆనందం, భవిష్యత్‌కు భరోసా కనిపిస్తుంది' అని వైఎస్ జగన్ చెప్పారు.
తన తండ్రి వైఎస్ఆర్ చూపిన దారిలోనే ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించామని, త్వరలోనే నవరత్నాల పాలన వస్తుందని, రాజన్న రాజ్యం రాబోతుందని అన్నారు. రాజన్న పాలనకోసం ప్రతి ఇంట్లో వారు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచిన బాటను ప్రజలంతా చూశారని, చంద్రబాబు వెయ్యి కుట్రలు చేసినా నిలబడగలిగే సత్తా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రజలకు అర్థమైపోయిందని, ప్రజలు కూడా ఇప్పటికే అది చూశారని అన్నారు.
చెప్పింది చేస్తాం.. చేయగలిగేదే చెప్తాం
'చెప్పింది చేస్తాం.. చేయగలిగేదే చెప్తాం.. మాట ఇస్తే తప్పం.. మడమ తిప్పం. అధికారం కోసం అడ్డగోలుగా గడ్డి తినం. చంద్రబాబు మాదిరి అధికారంకోసం మోసాలకు పాల్పడం. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడం. అన్ని వర్గాలకు తోడుగా ఉండే పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు దుర్మార్గానికి, మన సన్మార్గానికి మధ్య పోరాటం' అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఇప్పటికీ కొనుగోలు చేసిన ఆ 21మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల ఎన్నిక పెట్టే దమ్ము చంద్రబాబుకు లేకుండా పోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని చంద్రబాబుకు భయం పట్టుకుందని, రూ.5వేలు ఇస్తే తప్ప ఓటు వేస్తారనే నమ్మకం బాబుకు లేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు వీదిరౌడీకంటే దారుణంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటు వేయకుంటే తాట తీస్తానని చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వారిపై కళ్లెర్ర జేస్తున్నారని, ప్రశ్నించిన వ్యక్తిని 'నువ్వు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషివి.. జగన్ పంపిస్తే వచ్చావు' అని తిడుతున్నారని మండిపడ్డారు. అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తి గొంతు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, ఆయనను బంగాళాఖాతంలో వేసే గొంతు కూడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని వైఎస్ జగన్ హెచ్చరించారు. గతంలో మాదిరిగా నేడు ప్రజలను మోసగించే పరిస్థితి లేదని, రాజకీయాల్లో ఉండే అర్హత చంద్రబాబుకు లేదని మూడేళ్ల పాలన చెబుతోందని అన్నారు. చంద్రబాబు పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అది పోయి త్వరలోనే నవరత్నాలతో రాజన్న రాజ్యం వస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment