వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన మల్లాది విష్ణు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన మల్లాది విష్ణు

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన మల్లాది విష్ణు

Written By news on Thursday, July 27, 2017 | 7/27/2017


వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన మల్లాది విష్ణు
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ రోజు సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. మల్లాది విష్ణుతో పాటు వందలాది మంది ఆయన అనుచరులు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.

అంతకుముందు గన్నవరం ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌కు భారీ ర్యాలీతో మల్లాది స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మల్లాది విష్ణు ఉడా చైర్మన్‌గా పనిచేశారు. 2009లో వైఎస్‌ఆర్ ఆశీస్సులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.


Share this article :

0 comments: