మహానేతకు కుటుంబసభ్యుల ఘన నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహానేతకు కుటుంబసభ్యుల ఘన నివాళి

మహానేతకు కుటుంబసభ్యుల ఘన నివాళి

Written By news on Saturday, July 8, 2017 | 7/08/2017


ఇడుపులపాయ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి వేడుకలు శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానేత జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ వద్ద  కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.  వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనీల్, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం వైఎస్‌ఆర్‌ ఘాట్‌ ప్రాంగణంలోని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.  ఈ కార్యక్రమానికి మహానేత కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు మహానేత 68వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Share this article :

0 comments: