
హైదరాబాద్ : అధికారంలోకి రాగానే ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ పట్ల పలువురు ఆర్యవైశ్య సంఘాల నేతలు సంతోషం ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్, గుబ్బా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ జగన్‌ను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు.
2014 ఎన్నికల్లో ఆర్యవైశ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని నిలబెట్టుకోలేదని ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల నేతలు గుర్తు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానంటూ జగన్ ప్రకటించడం శుభ పరిణామమని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వరరావు అన్నారు. నంద్యాల ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేయడం ద్వారా తమ స్పందనను తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment