హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేయనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9వ తేదీన జరగనున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్.. నంద్యాల మండలంలోని రైతునగరానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారని చెప్పింది.
ఆ తర్వాత మండలంలో గల రామకృష్ణా నగర్, కానాల, హెచ్‌ఎస్ కొట్టాల, బాబానగర్‌లో పర్యటిస్తారని వెల్లడించింది. అనంతరం గోసపాడు మండలంలో గల ఎం చింతలకుంట, జూలపల్లి, పసురపాడు గ్రామాల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తారని తెలిపింది.

0 comments:
Post a Comment