వైఎస్ఆర్‌ కుటుంబం ప్రారంభం..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్‌ కుటుంబం ప్రారంభం..!

వైఎస్ఆర్‌ కుటుంబం ప్రారంభం..!

Written By news on Saturday, September 2, 2017 | 9/02/2017

సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 2వరకు కార్యక్రమం
ప్రతి ఒక్కరూ వైఎస్‌ఆర్‌ కుటుంబంలో భాగం కావాలి
అక్టోబర్‌ 27వ తేదీ నుంచి పాదయాత్ర
పులివెందులలో వైఎస్‌ జగన్‌

సాక్షి, పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలో వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 'వైఎస్‌ఆర్‌ కుటుంబం'లో చేరడానికి 9121091210 ఫోన్‌ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మిస్డ్‌కాల్‌ ఇస్తే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా మాట్లాడే అవకాశముంటుంది. చంద్రబాబు పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు, కష్టాలను ప్రజలు తెలియజేయవచ్చు.

ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 11 తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీవరకు 20 రోజులపాటు వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈలోపు సెప్టెంబర్‌ 2 నుంచి 11వ తేదీ వరకు బూత్‌ కన్వీనర్లకు కార్యక్రమాన్ని ఎలా విజయవంతంగా నిర్వహించాలనేదానిపై శిక్షణ ఇస్తారని తెలిపారు. 'గ్రామగ్రామంలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి. ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు, అన్యాయాలను పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజలకు వివరించాలి. దివంగత మహానేత, ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ చేసిన మంచి కార్యక్రమాలు, ఆయన పాలనలో జరిగిన సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాలి. ఏ రకంగా చంద్రబాబు మాట తప్పారో ప్రజలకు వివరించాలి. నవరత్నాలను ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలి. వైఎస్ఆర్ విశ్వసనీయత గురించి వివరించాలి. రాబోయే రోజుల్లో మనం నవరత్నాల ద్వారా చేయబోయే మంచిని ప్రజలకు తెలియజేయాలి' అని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 11నుంచి  పార్టీ బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా బాబు పాలనపై ప్రజలతో మార్కులు వేయించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఇంటిలో ఒక్కరైనా వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులు అయ్యేలా చేయాలని కోరారు.  దీనికోసం 9121091210 ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. నవరత్నాల పథకాలతో మళ్లీ రాజన్న రాజ్యానికి బీజం పడుతుందన్నారు. వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం ముగిసిన అనంతరం అక్టోబర్‌ 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని, ఆరు నెలలపాటు తన పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్‌ జగన్‌ తెలిపారు.
స్వర్ణయుగంలా వైఎస్‌ఆర్‌ పాలన..
దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ పాలన స్వర్ణయుగంలా గడిచిందని గుర్తుచేశారు. ఆయన పాలనలో ప్రతి పేదవాడికీ న్యాయం దక్కిందని, ప్రయోజనం చేకూరిందన్నారు. వైఎస్ఆర్‌ పాలనలో విద్యార్థులకు ఫీజురీయంబర్స్‌మెంట్‌, పేదవాళ్లకు కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ అందిందని గుర్తుచేశారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ వైఎస్‌ఆర్‌ ఇళ్లు ఇచ్చారన్నారు.

ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు..
ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చిన చంద్రబాబు తన మూడున్నరేళ్ల పాలనాకాలంలో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు రావాలని, రైతు రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలని ప్రచారంతో ఊదరగొట్టిన చంద్రబాబు.. ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి కూడా ఏ ఒక్కరికీ అందించలేదని గుర్తుచేశారు. మూడున్నరేళ్ల తర్వాత కూడా బ్యాంకుల నుంచి బంగారం రాలేదని, చంద్రబాబు సర్కారు రుణమాఫీకి చెల్లించింది వడ్డీలకు కూడా సరిపోలేదని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అన్ని వర్గాలకూ అన్యాయం జరిగిందన్నారు. 'నాయకుడు అన్న వాడు.. మాట తప్పనివాడై ఉండాలి. కానీ జీవితంలో నిజం చెప్పని చంద్రబాబులా ఉండరాదు. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు.. రాజకీయాల్లో మాట తప్పిన నాయకుల కాలర్ పట్టుకొని అడిగే రోజు రావాలి' అని వైఎస్‌ జగన్‌ అన్నారు.
Share this article :

0 comments: