సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లాలోని చీరాల, చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన పలువురు నేతలు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎడం బాలాజీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ చిమటా సాంబుతోపాటు గడ్డం శ్రీనివాసరావు(పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్), కర్ణ శ్రీనివాసరావు(వేటపాలెం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు), వేటగిరి సంజీవరావు(ప్రకాశం జిల్లా యానాది సంఘం అధ్యక్షుడు), బొచ్చుల మోహన్‌రావు(పుల్లాయపాలెం మాజీ సర్పంచ్) వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరంతా వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తమ అభీష్టాన్ని వ్యక్తం చేయగా.. ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అమృతపాణి, చీరాల పార్టీ అధ్యక్షుడు బొనిగల జైసన్‌బాబు, రూరల్ అధ్యక్షుడు పిన్నిబోయిన రామకృష్ణ ఈ సందర్భంగా హాజరయ్యారు.
పలమనేరు నేత చేరిక..
మరోవైపు పలమనేరుకు చెందిన నేత ఆకుల గజేంద్ర గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు జగన్‌మోహన్‌రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గజేంద్ర ఒకప్పుడు మంత్రి ఎన్.అమర్‌నాథరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉండేవారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ.. ఊపిరున్నంత వరకూ వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇచ్చినా గెలుపుకోసం గట్టిగా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయనకు జగన్ సూచించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కళత్తూరు నారాయణస్వామి, పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తలు రాకేష్‌రెడ్డి, సి.వి.కుమార్ హాజరయ్యారు.

0 comments:
Post a Comment