
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు నాయకులు వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి సోమవారం లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రామచంద్రమూర్తికి పార్టీ కండువా వేసి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుబాష్‌చంద్రబోస్, ముమ్మడివరం సమన్వయకర్త పితాని బాలకృష్ణ, కాకినాడ పార్లమెంటరీ కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ తదితరులు ఉన్నారు. కాగా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయ్ భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పార్టీ నేత గుర్రం గౌతమ్ తదిరులు వైఎస్ జగన్‌ను కలిశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన పీవీఎల్ నరసింహరాజు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు పాతపాటి సర్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, బలరామరాజు తదితరులు ఆయన వెంట ఉన్నారు
0 comments:
Post a Comment